ఇందువాసి గ్రామంలో పూడ్చిన డెడ్ బాడీని వెలికి తీసి పోస్టుమార్టం

ఇందువాసి గ్రామంలో పూడ్చిన డెడ్ బాడీని వెలికి తీసి పోస్టుమార్టం

కేటి దొడ్డి, వెలుగు: యువకుడి మృతిపై అనుమానాలు ఉండడంతో పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని ఇందువాసి గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై మల్లేశ్​ వివరాల మేరకు.. ఇందువాసి గ్రామానికి చెందిన కురువ చిన్న వీరేష్(30) గత నెల 2న  కర్ణాటకలోని రాయచూరు జిల్లా జలంగేరి గ్రామానికి కూలి పనికి వెళ్ళాడు. అక్కడ అనుమానాస్పదంగా మృతి చెందడంతో అక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకువచ్చి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

 17న  చిన్న వీరేశ్​ మృతి పై అనుమానం ఉందని  తండ్రి కురువ వెంకటేశ్​ గట్టు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని మంగళవారం  మహబూబ్ నగర్  నుంచి ఫోరెన్సిక్ ప్రొఫెసర్లు వచ్చి గట్టు తహసీల్దార్ సమక్షంలో డెడ్ బాడీని బయటికి తీసి పోస్టుమార్టం చేశారు.  పోస్టుమార్టం నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.