పాలకుర్తి, వెలుగు : చనిపోయాక తన శరీరాన్ని ఏదైనా వైద్య విద్యా సంస్థకు దానం చేయాలన్న భార్య కోరికను భర్త నెరవేర్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం నారబోయిన గూడెం గ్రామానికి చెందిన దోపతి రాంరెడ్డి, సరోజన (55) భార్యాభర్తలు. భార్య కోరిక మేరకు రాంరెడ్డి గురువారం జనగామ మెడికల్ కాలేజీకి ఆమె మృతదేహాన్ని అందజేశారు.
అరిష్టమంటూ ఊరంతా, చుట్టాలు వ్యతిరేకించగా, మహాత్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ గంట రవిందర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ తన మరణానంతరం కూడా మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తాను అని చెప్పాడు.