డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ.. పార్శిల్ లో చుట్టి పంపించారు.. గోదావరి జిల్లాల్లో కలకలం

డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ.. పార్శిల్ లో చుట్టి పంపించారు.. గోదావరి జిల్లాల్లో కలకలం

పార్శిల్ రాంగ్ అడ్రస్ కి డెలివరీ చేయడం... డ్యామేజ్ ఉన్న వస్తువులు రావడం.. సాధారణంగా జరిగేదే, ఫోన్ ఆర్డర్ చేస్తే.. ఫోన్ కి బదులు బాక్స్ లో రాళ్లు పెట్టి డెలివరీ చేయడం వంటి విడ్డూరాలు కూడా చూశాం.అయితే.. పార్శిల్ లో డెడ్ బాడీ వస్తే.. ఊహించుకుంటేనే ఒంట్లో వొణుకు పుడుతోంది కదా.. ఇక నిజంగా జరిగితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 

పశ్చిమ గోదావరిజిల్లాలోని ఉండి మండలంలో డెడ్‌బాడీ కలకలం రేపింది.. తులసి అనే మహిళకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్‌ పరికరాలు ఉన్నాయంటూ చెప్పి వెళ్ళిపోయాడు డెలివరీ బాయ్. కాసేపు ఆగిన తర్వాత పార్శిల్ ఓపెన్ చేసిన మహిళకు కాళ్లు చేతులు వణికిపోయాయి... ఆ పార్శిల్ లో డెడ్ బాడీ ఉండటంతో అంతా భయపడిపోయారు. ఈ ఘటనతో అవాక్కయిన మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

అసలు విషయం ఏంటంటే.. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంది తులసి. మొదటి విడతలో సేవా సమితి టైల్స్‌ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్‌లో ఎలక్ట్రిక్ సామగ్రికి బదులు డెడ్ బాడీ వచ్చింది. దీంతో.. షాక్ కి గురైన తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

పార్శిల్‌లో వచ్చిన కుళ్లిన డెడ్‌బాడీని చూసి ఏం చేయాలో అర్థం కాలేదని... ఇరుగు పొరుగు వారందరిని పిలిచి చూపించానని తెలిపింది మహిళ. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.పార్శిల్ ఇచ్చిందెవరు.. ఇంతకీ ఆ డెడ్‌బాడీ ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.