బావను హత్య చేసిన బావమరిది

నారాయణపేట, వెలుగు : ఈ నెల 2వ తేదీన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని అంతరాష్ట్ర బ్రిడ్జి వద్ద దొరికిన వ్యక్తి డెడ్‌‌‌‌బాడీ మిస్టరీ వీడింది. అక్కను హత్య చేయడంతో పాటు, పిల్లలకు అన్యాయం చేస్తున్నాడన్న కక్షతో బావమరిదే హత్య చేశాడని ఎస్పీ యోగేశ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌‌‌‌ జాగీర్‌‌‌‌ వెంకటాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన మహేశ్‌‌‌‌కు 2009లో రాయచూర్‌‌‌‌ పట్టణానికి చెందిన లక్ష్మీతో వివాహమైంది. 

వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా 2023లో మహేశ్‌‌‌‌ తన భార్య లక్ష్మిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఆరు నెలల కింద బెయిల్‌‌‌‌పై బయటకు వచ్చాడు. అయితే భూమి, ప్లాట్‌‌‌‌ను పిల్లల పేరున రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయాలని లక్ష్మి తమ్ముడు కృష్ణ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో రాజీ కుదిరింది. అయితే తాను భూమి మాత్రమే ఇస్తానని, ప్లాట్‌‌‌‌ ఇచ్చేది లేదని మహేశ్‌‌‌‌ వారం కింద కృష్ణకు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తన చెల్లెలి పిల్లలకు అన్యాయం జరుగుతుందని మహేశ్‌‌‌‌ను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. 

ఇందులో భాగంగా ఈ నెల 2న మహేశ్‌‌‌‌కు మద్యం తాగించి ఓ మైనర్‌‌‌‌ సహకారంతో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఆటోలో డెడ్‌‌‌‌బాడీని తీసుకొచ్చి కృష్ణా మండలంలోని బ్రిడ్జి పైనుంచి నదిలో పడేయాలని ప్రయత్నించాడు. కానీ బరువు ఎక్కువగా ఉండడంతో డెడ్‌‌‌‌బాడీని లేపలేక తెలంగాణ బార్డర్‌‌‌‌ వైపు వదలి వెళ్లిపోయాడు. విలేజ్‌‌‌‌ సెక్రటరీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన విచారణ చేసి కృష్ణతో పాటు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న మక్తల్‌‌‌‌ సీఐ చంద్రశేఖర్, ఎస్సై నవీద్‌‌‌‌ను ఎస్పీ అభినందించారు.