- కొత్త కాన్సెప్ట్‌తో మనోడి గేమ్ అదుర్స్!
- భారీగా పాపులర్ అయిన ‘డెడ్ మ్యాన్స్ ఫోన్’
న్యూఢిల్లీ: కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ‘డెడ్ మ్యాన్స్ ఫోన్’ మొబైల్ గేమ్ డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయి. బ్రిటీష్ ఇండియన్ సీఈఓ నిహాల్ థరూర్, కో–ఫౌండర్ బెనెడిక్ట్ తాతమ్ ఈ గేమ్‌ను డెవలప్ చేశారు. ఈ వారం ఈ గేమ్ 2,00,000 రిజిస్ట్రేషన్లను క్రాస్ చేయడం విశేషం. ఈ గేమ్ వెనుక బ్రిటిష్ అకాడమి ఫిల్మ్ అవార్డ్స్(బీఏఎఫ్‌టీఏ) స్టూడియో ఎలక్ట్రిక్ నోయిర్ ఉంది. ఈ గేమ్‌లో ప్లేయరే డిటెక్టివ్‌గా మారతాడు. గేమ్ స్టోరీ ఏంటంటే... లండన్ టీనేజర్ జెరోమ్ జాకబ్స్‌ను బాల్కనీ నుంచి తోసి చంపేస్తారు. అతను చనిపోయినప్పుడు తన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్‌కు ఇదే కీలకం. క్లూస్‌ను బట్టి ఎవరు చంపేశారో ప్లేయర్ కనిపెట్టాలి. అదే గేమ్.