ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు28 వరకు గడువు

ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు28 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 28 వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సర్కారు, ప్రైవేటు కాలేజీలతో పాటు అన్ని గురుకులాల్లోనూ ఇదే షెడ్యూల్ అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. పేరెంట్స్ కేవలం గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందాలని సూచించారు.