పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడవు

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నేటితో మే 09వ తేదీ గురువారం రోజుతో నామినేషన్ల గడవు ముగిసింది.  రేపు అనగా మే10నుంచి  నామినేషన్ల పరిశీలన ప్రారంభం అవుతుంది.13 వరకు ఉపసంహరణ గడువు  ఉంది.  మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా..  జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.

ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో  ఎమ్మెల్సీ పదవికి  డిసెంబరు 9న రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈసీ ఈ స్థానానికి షెడ్యూల్ రిలీజ్ చేసింది.  ఈ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డిలు పోటీలో ఉన్నారు.  

ఉప ఎన్నిక జరిగే సెగ్మెంట్ పరిధిలో మొత్తం 12  జిల్లాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇప్పటికే వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. ప్రైవేట్​ టీచర్లు, టీచర్ల సంఘాలు, యువజన సంఘాలతో అభ్యర్థులు చర్చలు చేస్తూ, తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు