ఆధార్ అప్డేట్కు సంబంధించి UIDAI కీలక ప్రటకన చేసింది. ఆధార్ ఉచిత అప్ డేట్ గడువును పొడిగించింది. ఆధార్ ఉచిత అప్ డేట్ కు చివరి తేది డిసెంబర్ 15,2023 కాగా.. మరో మూడు నెలలు అంటే.. మార్చి 14, 2024 వరకు పొడిగించాలని UIDAI నిర్ణయించింది. మార్చి 14,2024 వరకు https://myaadhaar.uidai.gov.in/ ద్వారా myAadhaar పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ లను ఉచితంగా చేసుకోవచ్చు.
ఆధార్ కార్డ్ ని ఎలా అప్ డేట్ ఇలా చేయాలి
- అధికారిక UIDAI వెబ్ సైట్ https://myaadhaar.uidai.gov.in/ ని సందర్శించాలి.
- ఆధార్ నంబర్ , క్యాప్చా నమోదు చేయాలి
- OTPని Send పై క్లిక్ చేసి మీరు లింక్ చేసిన ఫోన్ నంబర్ ద్వారా అందుకున్న OTP ని నమోదు చేయాలి
- తర్వాత అప్ డేట్ డోమోగ్రాఫిక్స్ డేటా ఎంచుకోవాలి.
- పేజీలో సంబంధిత ఎంపికలను ఎంచుకొని Proceed పై క్లిక్ చేయాలి.
- తర్వాత కూడా పేజీలో మార్పులు చేయొచ్చు.
- సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలి
- నమోదు చేసిన వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలి
- Change Request క్లిక్ చేయడం ద్వారా ఫారమ్ ను సబ్ మిట్ చేయాలి.
మార్పు స్థితిని ట్రాక్ చేయడానికి అప్ డేట్ అభ్యర్థన సంఖ్య (URN) ని ఉపయోగించాలి.