
రష్యా,ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్, జెలెన్ స్కీ మధ్య చర్చలు విఫలం అయిన వెంటనే.రష్యా తన ప్రతాపం చూపించింది. ఉక్రెయిన్పై డ్రోన్లతో మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా 50 మంది గాయపడ్డారు. రష్యా దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాతో చర్చలు విఫలం అయిన గంటల్లో ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఉధృతం చేసింది. ఉక్రెయిన్ పై డ్రోన్లతో దాడులు చేసింది. నల్ల సముద్రం ఓడరేవు ఒడెసాలో అర్థరాత్రి రష్యా డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. ఈస్ట్ టౌన్ ఖార్కివ్‌లో జరిగిన దాడిలో మరో ఐదుగురు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
స్థానిక అధికారుల వివరాల ప్రకారం..ఒడెసాలో డ్రోన్ దాడిలో ఇల్లు,దుకాణంలో మంటలను రేగాయి. ఓ వ్యక్తి మృతిచెందారు, మరొకరు గాయపడ్డారు. ఖార్కివ్‌లో దాదాపు 8డ్రోన్లతో దాడులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆస్పత్రి ధ్వంసమైంది. డజన్ల కొద్దీ భవనాలు దెబ్బతిన్నాయి. ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.ఆస్పత్రిలో ఉన్న 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడుల్లో మంటలను చెలరేగడంతో అత్యవసర సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.