నేషనల్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌లో ధనుశ్‌‌కు సిల్వర్‌‌‌‌

నేషనల్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌లో ధనుశ్‌‌కు సిల్వర్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : తెలంగాణకు చెందిన బధిర షూటర్‌‌‌‌ ధనుశ్ శ్రీకాంత్‌‌ సీనియర్ నేషనల్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌లో సత్తా చాటాడు. సాధారణ షూటర్లతో పోటీ పడి సిల్వర్ మెడల్‌‌ నెగ్గాడు.  సోమవారం భోపాల్‌‌లో జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో  ధనుశ్‌‌ 252.2 స్కోరుతో రెండో స్థానం సాధించాడు.

0.1 పాయింట్ తేడాతో  బంగారు పతకం కోల్పోయాడు.   రైల్వేస్‌‌ షూటర్‌‌‌‌  తుషార్‌‌‌‌ మానె 252.3 స్కోరుతో గోల్డ్ నెగ్గగా..  రాజస్తాన్‌‌కు చెందిన యశ్‌‌ వర్దన్‌‌ కాంస్యం గెలిచాడు. మరోవైపు జూనియర్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్‌‌ 254.9 స్కోరుతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తూ బంగారు పతకం నెగ్గాడు.