వాట్సాప్..స్మార్ట్ఫోన్ ప్రతి ఒక్కరూ ఈ మేసేజింగ్ యాప్ వాడుతున్నారు.టెక్స్ట్, వాయిస్ మేసేజ్ లు, వీడియాలో, ఫొటోలు వాయిస్ , వీడియో కాల్స్ చేయడానికి నంబర్ వన్ ఇన్స్టంట్ మేసేజింగ్ యాప్.ఈ యాప్ ద్వారా మన ఉన్న లోకేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇలా చాలామంది కమ్యూనికేషన్ పరంగా ఈ ఇన్స్టంట్ మేసేజ్ యాప్ పై ఆధారపడిఉన్నారు. ఒకవేళ వాట్సాప్ ఖాతా బ్లాక్ అయితే..? వాట్సాప్ ఖాతాను తిరిగి ఎలా పొందాలి? ఇటీవల సినీనటుడు సోనూ WhatsApp ఖాతా బ్లాక్ అయిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి వాట్సాప్ వినియోగదారుల్లో తమ ఖాతాల సురక్షితంగా ఉన్నాయా లేదా అనే డౌట్ మొదలైది.. వాట్సాప్ ఖాతా ఎందుకు బ్లాక్ అవుతుంది.. ఒకవేళ అయితే అన్బ్లాక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
వాట్సాప్ ఎందుకు బ్లాక్ అవుతుంది?
వాట్సాప్ అకౌంట్ బ్లాక్ కు సంబంధించిన మూల కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. సంస్థ నిబంధనలు, విధానాలను ఉల్లంఘించినట్లయితే ఆ ఖాతాలను బ్లాక్ చేస్తారు. స్పామింగ్, కొన్ని కొన్ని సమయాల్లో ఈ ఫ్లాట్ ఫాంలో అనుచితమైన కంటెంట్ అంటే.. ఉదాహరణకు దేశ భద్రతకు భంగం కలిగించే వీడియోలు, ఫొటోల వంటివి షేర్ చేసినప్పుడు బ్లాక్ చేయబడుతుంది.
వాట్సాప్ ఖాతా బ్లాక్ చేయడానికి కారణాలు ..
- అన్ సాలిడేటెడ్ మేసేజ్ పంపడం
- ఎక్కువ గ్రుపుల్లో చేరడం
- వాట్సాప్ అనధికార వెర్షన్లను ఉపయోగిచడం
- వాట్సాప్ నిషేధం.. రకాలు
- రెండు రకాలు వాట్సాప్ ఖాతాల నిషేధించడం జరుగుతుంది.
మొదటిది.. స్పామ్ వంటి తక్కువ తీవ్రత గల ఉల్లంఘనలను కలిగి ఉన్నప్పుడు స్వల్పకాలకి నిషేధం ఉంటుంది. కొంతకాలం తర్వాత అన్ బ్లాక్ చేస్తారు.
రెండోది ..హానికరమైన కంటెంట్ ను పంపించినప్పుడు, నిరంతర స్పామింగ్ వంటి నిబంధనలు, విధానాల ఉల్లంఘన జరిగినప్పుడు శాశ్వత నిషేధం ఉంటుంది. ఖాతానుశాశ్వతంగా రద్దు చేస్తారు.
వాట్సాప్ ఖాతాను అన్ బ్లాక్ చేయడం ఎలా?
- మొదట మీ WhatsApp ని అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేయాలి. మీ బ్లాక్ చేయబడిన ఫోన్ నంబర్ తోనే మళ్లీ మళ్లీ నమోదు చేసుకోవాలి. ఇది తప్పనిసరి,
- WhatsApp అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న Support ను సెలక్ట్ చేసుకొని వివరణాత్మకంగా అకౌంట్ రివ్యూకోసం రిక్వెస్ట్ పెట్టాలి.
- WhatsApp కి ఈమెయిల్ పంపండి: మీ ఈ మెయిల్ ద్వారా WhatsApp సపోర్ట్ కోరవచ్చు. సమస్యను వివరించి మీ ఖాతాను అన్ బ్లాక్ చేయమని వారిని రిక్వెస్ట్ చేయవచ్చు. తగిన వివరాలు , సాక్ష్యాలు అదించాలి
- మీరు బిజినెస్ API వినియోగదారు అయితే ఖాతా WhatsApp లో బిజినెస్ సపోర్ట్ టీం ను సంప్రదించాలి.
- భవిష్యత్ లో WhatsApp ఖాతా బ్లాక్ కాకుండా ఉండాలంటే..
- కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి
- తప్పుుడు సమాచారం పంపకూడదు. హానికరమైన కంటెంట్ వ్యాప్తి చేయకూడదు. లింక్ లు, ఫైల్ లను షేర్ చేసేటప్పేుడు జాగ్రత్త వహించాలి
- WhatsApp అధికారిక వెర్షన్లను మాత్రమే ఉపయోగించాలి
- WhatsApp ఖాతా అన్ బ్లాక్ చేయడానికి సమయం పట్టవచ్చు.ఓపికగా వేచి చూడాలి.