Steve Smith catch:సూపర్ క్యాచ్..అయినా ఔటివ్వలేదు

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తిని వెళ్లగక్కాడు. స్మిత్ అసంతృప్తికి కారణమేంటంటే..కష్టపడి క్యాచ్ పట్టినా అంపైర్ ఔటివ్వకపోవడమే.

అద్భుతమైన క్యాచ్..

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో  స్టీవ్ స్మిత్ అద్బుతమైన క్యాచ్ పట్టాడు. హేజిల్ వుడ్ వేసిన గుడ్ లెంగ్త్ బాల్  సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాట్ ఎడ్జ్ను తాకి రెండో స్లిప్లో ఉన్న స్టీవ్ స్మిత్ ముందు పడింది. దీన్ని స్మిత్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. వెంటనే అంపైర్ను అప్పీల్ చేశారు. వారు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. 

షాకింగ్ నిర్ణయం..

క్యాచ్ను రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు షాక్కు గురయ్యారు. అద్భుతంగా క్యాచ్ పట్టిన స్టీవ్ స్మిత్ ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. పదే పదే రిప్లేలో చెక్ చేసినా..బంతి నేలను తాకనట్లు స్పష్టంగా కనిపించినా కూడా థర్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంపై స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్టేడియంలోని బిగ్ స్క్రీన్పై నాటౌట్ అని కనిపించడంపై స్మిత్ నమ్మకలేకపోయాడు.