టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటూ తన ఆటతో భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. గ్రౌండ్ లో ఉన్నప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల నడుచుకునే తీరు కోహ్లీలోని గొప్పతనాన్ని సూచిస్తుంది. స్టీవ్ స్మిత్, నవీన్ ఉల్ హక్ విషయంలో కోహ్లీ ప్రవర్తించిన తీరుకు క్రికెట్ లవర్స్ ఈ దిగ్గజం మీద ప్రశంసలు కురిపించారు. అయితే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఓ పాడ్‌కాస్ట్‌లో ఎల్గర్ మాట్లాడుతూ.. 2015లో టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చా. స్పిన్ పిచ్ లు కావడంతో అశ్విన్, జడేజా బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టంగా అనిపించింది. ఆ టైమ్‌లో కోహ్లీ నా మీద ఉమ్మేశాడు. దీంతో నా భాషలో కోహ్లీని తిట్టి బ్యాట్‌తో కొడతానని హెచ్చరించా. ఈ విషయం డివిలియర్స్ కు తెలిసింది. నా టీమ్ టీమ్మేట్ మీద అలా ఎందుకు ఉమ్మివేశావని విరాట్‌ను ఏబీడీ అడిగాడని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రెండేళ్లకు భారత్ టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా వచ్చిందని.. కోహ్లీ తనకు సారీ చెప్పాడని ఎల్గర్ అన్నాడు.
మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ అక్కడితోనే ముగిసింది. అప్పట్లో కోహ్లీ డ్రింక్ చేసేవాడు. దీంతో మేము ఆ రోజు మూడు గంటల వరకు తాగుతూనే ఉన్నాం. అయితే ఆ తర్వాత కోహ్లీ తాగటం మానేశాడని..ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని ఈ మాజీ సౌతాఫ్రికా ఓపెనర్ తెలిపాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా సిరీస్ లో ఎల్గర్ ఔటైనప్పుడు కోహ్లీ సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ సిరీస్ అతడికి చివరిది కావడంతో విరాట్ ఎల్గర్ ను గౌరవించాల్సిందిగా కోరాడు. దీంతో పాటు తన జెర్సీని కోహ్లీ ఎల్గర్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు.
Dean Elgar :- Virat Kohli calls me aside and said can we go to have a drink I want to apologise for my actions and we drank till 3 in the morning
— DHONIverse (@MSD_071113_) January 29, 2024
Not to forget he also used to promote a alcohol brand named "Royal Challenge" pic.twitter.com/9mRlXV31KM