దేవుడా.. ప్రపంచంలోని అన్ని కుక్కలను కాపాడు : ఓ పిల్లోడి ప్రార్థన

దేవుడా.. ప్రపంచంలోని అన్ని కుక్కలను కాపాడు : ఓ పిల్లోడి ప్రార్థన

సోషల్ మీడియాలో రోజుకు కొన్ని లక్షల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని నవ్వును తెప్పిస్తే.. మరికొన్ని సామాజిక స్పృహను తట్టిలేపేలా ఉంటాయి. దానికి ఉదాహరణగా చెప్పుకునే ఓ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలి కాలంలో జంతు హింస అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న ఈ క్రమంలో ఓ బాలుడు కుక్కలను ఆశీర్వదించమని, వాటికి ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా చూడమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు.

ఇంటర్నెట్ లో పలువురు చేత ప్రశంసలు అందుకుంటున్న ఈ వీడియోలోని బాలుడు చెప్పిన మాటలు జంతు ప్రేమికులనే కాకుండా సామాన్యులను సైతం కదిలిస్తున్నాయి. కుక్కలు, ఇతర జంతువుల కోసం అతను చేసే ప్రార్థనను చూసి ఈ సమయంలో ఇది చాలా అవసరమని ఎంతో మంది ఆ బాలుడికి మద్దతుగా నిలుస్తున్నారు.

ALSO READ :అన్నం పెట్టిన యజమాని ఇంటికే కన్నం వేసిన్రు

❤️?? pic.twitter.com/fxgrotbClY

— Kaveri ?? (@ikaveri) July 8, 2023
 

ఈ వీడియోలో బాలుడి, అతని పెంపుడు కుక్క చైల్డ్ పార్క్ వద్ద రైడ్‌లో ఆడుతున్నట్లు కనిపిస్తుంది. 'బ్లూ' అని ఆ పిల్లాడు కుక్కను పిలవగానే, అది వెంటనే అతని వైపుకు పరుగెత్తుకు వచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ప్రార్థిస్తుండడం చూడవచ్చు. "ఈ రోజు మనం ప్రపంచంలోని అన్ని కుక్కల కోసం ప్రార్థించబోతున్నాం" అని పిల్లవాడు చెప్పడం కూడా ఇక్కడ కనిపిస్తోంది. అలా తన పెంపుడు కుక్క బ్లూతో కలిసి మోకరిల్లి దేవునికి నమస్కరిస్తూ, తన ప్రార్థనను ప్రారంభిస్తాడు: "ప్రార్థిద్దాం. ప్రియమైన దేవా, మీరు అన్ని కుక్కలను జాగ్రత్తగా చూసుకోవాలని, వాటిని సురక్షితంగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను." తన హృదయపూర్వక ప్రార్థన చేశాడు. "మీరు అన్ని కుక్కలకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్." అని చెప్పి, ఆ తర్వాత బాలుడు తన పెంపుడు జంతువుకు సహకరించినందుకు మెచ్చుకున్నాడు. వీడియో చివర్లో "గుడ్ బాయ్" అని బాలుడు చెబుతూ కుక్కను ప్రశంసించడం అందర్నీ ఆకర్షిస్తోంది.