అక్షయ్, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు జంటగా దినేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. ఐశ్వర్య మరో హీరోయిన్. పీఎన్ బలరామ్ ఈ కథను రాసి, చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోని ‘చిరుప్రాయం’ అనే మొదటి పాటను మలయాళ స్టార్ మోహన్ లాల్ లాంచ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘శ్రీకృష్ణుడు చేసిన ఒక మిరాకిల్ పాయింట్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. పాటలన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘చిరుప్రాయం’ పాట నా మనసును హత్తుకుంది. పాటలాగే సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.
‘లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన చివరి పాట ఇది. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన ప్రేరణగా తీసుకొని ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెరకెక్కించాం. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో శ్రీకృష్ణుడి వల్ల ఓ మిరాకిల్ జరిగింది. అదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్’ అని మేకర్స్ తెలియజేశారు.