భగవంతుడికి, భక్తుడికి మధ్య..

భగవంతుడికి, భక్తుడికి మధ్య..

అక్షయ్‌‌‌‌‌‌‌‌, ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు, జంటగా దినేష్ బాబు రూపొందించిన చిత్రం ‘డియర్ కృష్ణ’.  ఐశ్వర్య మరో హీరోయిన్.  పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. జనవరి 24న సినిమా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా ఈ మూవీ బిగ్ టికెట్‌‌‌‌‌‌‌‌ను హీరో ఆది సాయికుమార్ లాంచ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. మరోవైపు ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులకు ఓ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు నిర్మాత బలరామ్. మొదటి 100 టికెట్ల బుకింగ్‌‌‌‌‌‌‌‌లో ఒక టికెట్‌‌‌‌‌‌‌‌ను డిపింగ్ పద్దతి ద్వారా ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి రూ.పదివేలు  క్యాష్ బ్యాక్ కింద అందించనున్నట్ల బలరామ్ తెలిపారు. 

రియల్ ఇన్సిడెంట్స్  ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక 
ఘటన ఆసక్తిని పెంచేలా ఉంటుందని  దర్శకుడు దినేష్ బాబు చెప్పారు.  హరి ప్రసాద్ 
సంగీతం అందించాడు.