ఉత్తరాఖాండ్‌లోని పౌరీ, అల్మోరా జిల్లాల సరిహద్దులో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కి చేరింది. పౌరి జిల్లా నుంచి రామ్‌నగర్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి కుపి సమీపంలోని 200 మీటర్ల లోయలో పడింది. గర్హ్వాల్ మోటార్ యూజర్స్ ఫ్లీట్‌కు చెందిన ప్యాసింజర్ బస్సులో 46 మంది ప్రయాణీస్తున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 23 మృతదేహాలను వెలికి తీశారు.
అల్మోరా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ టీం, ఎమర్జెన్సీ సర్వీస్ రెస్క్యూ ఆపరేషన్ టీంలు ఘటనాస్థలిక చేరుకున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగులున్నాయి. మొదట ఈ యాక్సిడెంట్‌లో చనిపోయిన వారి సంఖ్య 15 మంది అని అధికారులు అంచనా వేశారు. కానీ.. సహాయక చర్యలో భాగంగా ఇప్పటి వరకు 23 డెడ్ బాడీలను వెలికి తీశారు రెస్క్యూ టీంలు. 36 మంది మృతి చెందారని తెలుస్తోంది. మరో 25 మందికి గాయాలు అయ్యాయి.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ప్రమాద జరిగిన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Major accident in Almora, Uttarakhand.
— शंकरसिंह परमार (Hindu)🇮🇳🚩 (@Shankarparmar99) November 4, 2024
36 people dead so far after bus falls into ditch.
May God grant peace to the souls of all and give strength to their families to bear such a great loss.🙏🏻
Om Shanti.🙏🏻😞#BusAccident pic.twitter.com/YDj4UTDK20