సమత నిందితులకు ఉరి శిక్ష

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమత కేసు తుది తీర్పు నేడు వెలువడింది. దోషులకు ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.  ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా తేల్చి శిక్ష ఖరారు  చేసింది. అయితే నిందితులు మాత్రం తమకు క్షమాభిక్ష పెట్టాలని కోర్టును వేడుకున్నారు. తమ కుటుంబాలకు తామే ఆధారమని న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. నేరం రుజువైనట్లు న్యాయమూర్తి నిందితులకు తెలిపారు.

కుమరం భీం జిల్లా, ఎల్లపటూర్‌లో నవంబర్ 24, 2019న సమతను ముగ్గురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. షేక్ మగ్దూం, షేక్ బాబు, షేక్ షాబొద్దీన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు నవంబర్ 27న అదుపులోకి తీసుకున్నారు. వీరిలో A1గా షేక్ బాబు, A2గా షాబొద్దీన్, A3గా షేక్ మగ్దూంలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం డిసెంబర్ 11న ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. డిసెంబర్ 31న విచారణ పూర్తయింది. కేసుకు సంబంధించి దాదాపు 25 మందిని విచారించారు. ఆ కేసుకు సంబంధించిన వాదనలు జనవరి 20న పూర్తయ్యాయి. కేవలం 45 రోజులలోనే కేసు ఫైనల్ హియరింగ్‌కు రావడం ఒక విశేషం. అయితే.. కేసు తుది తీర్పును జనవరి 27 ఇవ్వాలని న్యాయమూర్తి భావించారు. కానీ, ఆయన ఆరోగ్యం సరిగాలేనందున ఆ తీర్పును జనవరి 30కి వాయిదా వేశారు. దాంతో నిందితులకు ఉరి శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తన తీర్పును వెలువడించారు.

For More News..

మేకలమ్మితే రూ. 1.32 కోట్లు

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు