నారాయణ పేట ప్రమాదంలో 10కి పెరిగిన మృతుల సంఖ్య

నారాయణ పేట ప్రమాదంలో 10కి పెరిగిన మృతుల సంఖ్య

నారాయణపేట:  మరికల్ మండలం తీలేరు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. శిథిలాల నుంచి 10 మృతదేహాలు వెలికితీశారు. బయటకు తీసినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

పోస్టుమార్టం కోసం మృతదేహాలను నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మహబూబ్ నగర్ – నారాయణపేట కలెక్టర్లు రోనాల్డ్ రాస్, వెంకట్రావు పరిశీలించారు.

ఈ దుర్ఘటనతో తీలేరు గ్రామంలో విషాదం కనిపిస్తోంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మృతులను అధికారులు గుర్తించారు. వారి పేర్లు :

1. అనురాధ (30)
2. పల్లేగడ్డ భీమమ్మ(34)
3. గాలిజుట్టు బుడ్డమ్మ (36)
4. బీడీ లక్ష్మీ (32)
5. కుమ్మరి లక్ష్మీ (33)
6. మంగమ్మ మెరటి (33)
7. చాకలి అనంతమ్మ(42)
8. పల్లెగడ్డ శేషమ్మ(55)
9. బీరెల్లి అనంతమ్మ(60)
10. చర్లపల్లి లక్ష్మీ (42)