
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని మాజీ సీఎం కేసీఆర్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పు పది రెట్లు పెరిగిందన్నారు. వామనావతారం లెక్క ఓ వైపు అప్పులు పెరగ్గా మరోవైపు బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయన్నారు.