ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్రు

  • ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు, వెలుగు : వందలాది మంది బలిదానాలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని మహిళా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. ధనికులు, పెత్తందార్లకు ఉపయోగపడే ధరణి తీసుకు వచ్చినందుకు ఉత్సవాలు చేస్తున్నారా ? అని ప్రశ్నించారు.  ములుగు క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. హామీలను నెరవేర్చకుండా, ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 

కేజీ టు పీజీ విద్య, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీలన్నీ ఎటు పోయాయని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ కేవలం ధనికులకే ఉపయోగపడుతోందని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచాక దానిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సెల్​జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు ఎండీ.చాంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాషా, వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకుతోట చంద్రమౌళి, యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్ పాల్గొన్నారు.