ఫ్రెంచ్ స్పోర్ట్స్ రిటైలర్ డెకాథ్లాన్ భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచ మార్కెట్లలో ఒకటైన భారత్ లో తన కంపెనీ ఉత్పత్తులను పెంచడానికి, రిటైల్ ను పెంచడానికి పెట్టుబడులను వేగవంతం చేస్తున్నట్లు టెకథ్లాన్ గ్లోబల్ సీఈవో మార్టిన్ కొప్పోలా అన్నారు. అధిక పెట్టుబడుల ద్వారా భారత్ నుంచి అధికంగా ఉత్పత్తి చేపట్టాలని భావిస్తోంది. డెకథ్లాన్ ..స్పోర్ట్స్ రిటైలర్ కు ముఖ్యమైన తయారీ కేంద్రంగా కూడా అభివృద్ది చెందుతోంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లకు ఉత్పత్తిలో 65 శాతం ఎగుమతి చేస్తోందని మార్టిన్ అన్నారు.
డెకథ్లాన్ టాప్ టెన్ గ్లోబల్ మార్కెట్లలో భారత్ ఒకటి.ఇది 2009 నుంచి 129 స్టోర్లతో నెట్ వర్క్ ను నిర్వహిస్తుంది. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ అభివృద్ది చెందింది. మధ్య తరగతి క్రీడాకారుల కోసం డెకథ్లాన్ ప్రాడక్టులను అందిస్తోంది. భారత్ లో పెట్టుబడులు, ఉత్పత్తి, స్థానిక సోర్సింగ్ ను వేగవంతం చేయడానికి , స్పోర్ట్స్ రిటైల్ సేల్స్ నెబట్ వర్క్ ను విస్తరించడానికి డెకథ్లాన్ సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.
ప్రస్తుతం 60 శాతం ఉన్న ఉత్పత్తులను రాబోయే రెండేళ్లలో 85 శాతానికి పెంచాలని డెకథ్లాన్ యోచిస్తోంది. ప్రస్తుతం 65 శాతం ఇండియాలో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. దీనిని మరింత పెంచేందుకు డెకథ్లాన్ ప్రణాళికలు చేస్తోంది.
2009 లో క్యాష్ అండ్ క్యారీ రిటైలర్ గా భారత్ లో అడుగుపెట్టిన డెకథ్లాన్, 2013లో ప్రభుత్వం చే సింగిల్ బ్రాండ్ రిటైలర్ గా మారింది. 2023 ఆర్థిక సంవత్సరంతో డెకథ్లాన్ ఇండియా అమ్మకాలు 37 శాతం వృద్ధిని సాధించి రూ.3,995 కోట్లకు చేరుకున్నాయి.