ఇండియాలో రూ.933 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న డెకాథ్లాన్‌

న్యూఢిల్లీ: స్పోర్ట్స్ రిటైలర్ డెకాథ్లాన్‌ ఇండియాలో రూ. 933 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. రానున్న ఐదేళ్లలో రిటైల్ స్టోర్లను పెంచడానికి ఈ డబ్బులు ఖర్చు చేయనుంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియా మార్కెట్ నుంచి డెకాథ్లాన్‌కు రూ.4,000 కోట్ల రెవెన్యూ వచ్చిందని, రానున్న మూడు నుంచి ఐదేళ్లలో బిజినెస్ డబుల్ అవుతుందని డెకాథ్లాన్ ఇండియా సీఈఓ శంకర్‌‌ ఛటర్జీ అన్నారు. 

తమ టాప్ 10 మార్కెట్లలో ఇండియా ఒకటని చెప్పారు. ఏడాదికి 10 నుంచి 15 స్టోర్లను ఓపెన్ చేస్తామని, మొత్తం స్టోర్ల సంఖ్యను 190 కి పెంచుకుంటామని వెల్లడించారు.