సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం బిల్డింగ్ సగభాగాన్ని అధికారులు నేలమట్టం చేశారు. ఎల్ ఆకారంలో ఉన్న బిల్డింగ్ మెయిన్ గేట్ వైపు ఉన్న ఆరు అంతస్తులను ఒక్కసారిగా నేలమట్టం చేశారు. దీంతో చుట్టపక్కల పొగ కమ్ముకుపోయింది. ఎడమ వైపు ఉన్న ఆరంతస్తుల భవనం ఇంకా అలాగే ఉంది.
గత ఆరు రోజులుగా అధికారులు బల్డింగ్ ను కూల్చుతున్నారు. పూర్తిగా కూల్చేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందని చెప్పారు. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా భవన కూల్చివేత పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.