సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు మరింత ఆలస్యం కానున్నాయి. టెండర్ దక్కించుకున్న ఎస్‌కే మల్లు ఏజెన్సీ సాయంత్రం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే బిల్డింగ్ కూల్చేందుకు వచ్చిన భారీ క్రేన్ లో ఆయిల్ లీకేజీ అవుతుండడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఆ క్రేన్ స్థానంలో ఏజెన్సీ మరో మిషన్ తెప్పిస్తోంది. దీంతో పాటు హై రీచ్ భూమ్ వెహికిల్ ను సైతం తెప్పిస్తున్నారు. అయితే మిషన్ల రాక ఆలస్యమవుతుండటంతో సాయంత్రం కూడా పనులు స్టార్ట్ కావడం కష్టమేనని ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు. బల్దియా అధికారులు మాత్రం సాయంత్రానికి పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు.
బిల్డింగ్ కూల్చివేతకు పనులకు రూ.33.86 లక్షల అంచనా వ్యయంతో బుధవారం టెండర్లు ఆహ్వానించగా 8 ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఎస్కే మల్లు అనే ఏజెన్సీ రూ. 25.94 లక్షల రూపాయలకు కోట్ చేసి టెండర్‌ను దక్కించుకుంది. కూల్చివేత టైంలో చుట్టుపక్కల ఇండ్లు డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు ప్రకటించారు.