డిసెంబర్ 21 శనివారం ఆకాశంలో చాలా ప్రత్యేకమైన రోజని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోజు ( డిసెంబర్ 21) చాలా తక్కువ రోజని చెబుతున్నారు. పగలు 8 గంటలు మాత్రమే ఉండనుంది.. మిగిలిన 16 గంటలు రాత్రి ఉంటుంది. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర అర్ధగోళంలో శీతాకాలపు మొదటి రోజును శీతాకాలపు అయనాంతం అంటారు. శీతాకాలపు అయనాంతం రావడానికి కారణం భూమి తన ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది డిసెంబర్ 21 న కూడా సూర్యుడు భూమి దక్షిణ అర్ధగోళంలో అత్యున్నత బిందువులో ఉంటాడు. జ్యోతిషశాస్త్రంలో ఈ సంఘటనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది.సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి సంవత్సరంలో అతి తక్కువ రోజు వరకు ఉంటాడని నమ్ముతారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్లేందుకు సిద్ధమవుతాడని అంటారు. సంవత్సరంలో అతి చిన్న రోజుగా గుర్తించబడింది. ఈ రోజును ఆంగ్లంలో వింటర్ సోల్స్టిస్ అంటారు.
డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. దీంతో శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలోని ప్రజలు పలురకాల నమ్మకాలను పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు. ఈ రోజునే భూమి తన చుట్టూ తాను నిటారుగా కాకుండా కొంచెం వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో కర్కాటక రేఖ సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఉత్తర ధువంలో ఎండాకాలం వస్తుంది. అప్పుడు ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు.
పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాయణం శక్తికాలం. సూర్యుడు ప్రతి ప్రాణుల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. ఈ రోజున అన్నదానం, బట్టలు, దానధర్మాలు చేయడం శుభప్రదం. బలహీనమైన సూర్యునికి బలాన్ని ఇవ్వడానికి ఓం సూర్యై నమః అనే మంత్రాన్ని జపించాలని అంటున్నారు.