ఫ్రైడే వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ కి పండగే. అయితే ఈ వారం మూవీ ప్రియులకి కొంతమేర నిరాశ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా దెబ్బకి పెద్ద సినిమాల రిలీజ్ సైతం వాయిదా పడ్డాయి. కానీ డిసెంబర్ 25న క్రిస్మస్ బేబీ జాన్ (హిందీ), శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్(తెలుగు), బరోజ్ 3D(మలయాళం) తదితర సినిమాలు రిలీజ్ అయినప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టడం లేదు.
అయితే నేడు రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ చూసినట్లయితే నూతన దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన "పతంగ్" సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గాలి పటాల ఆట బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నూతన నటీనటులు ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ తదితరులు నటించారు. విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాకా మరియు సురేష్ కోతింటి కలసి సంయుక్తంగా నిర్మించారు. ఆ మధ్య ఈ సినిమా టీజర్ విడుదలకాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హీరోగా నటించిన మ్యాక్స్ సినిమా కూడా ఈ రోజు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు కన్నడ ప్రముఖ డైరెక్టర్ విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించగా మ్యూజిక్ డైరెక్టర్ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్, అచ్యుత్ కుమార్, సంయుక్త హమద్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. విలన్ గా సుకుమార్ నటించాడు. పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.