డిసెంబర్ 28 నుంచి గిరిజన గురుకులాల..రాష్ట్రస్థాయి ఆటల పోటీలు

ఇల్లెందు, వెలుగు : ఈనెల 28 నుంచి గిరిజన సంక్షేమ గురుకులాల 7వ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను సుదిమళ్ల గిరిజన గురుకుల కళాశాలలో నిర్వహించనున్నట్లు ఖమ్మం రీజియనల్​ కో-ఆర్డినేటర్​ రాజు,  కళాశాల ప్రిన్సిపాల్ అరుణకుమారి తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాలను నాలుగు జోన్లుగా విభజించినట్లు  తెలిపారు.

ఆదిలాబాద్ జోన్-1, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జోన్--2, ఖమ్మం, నల్గొండ జోన్--3, మహబూబ్ నగర్, రంగారెడ్డి జోన్--4 వారీగా  డివైడ్​ చేశారన్నారు. ప్రతీ జోన్​ నుంచి 300 మంది విద్యార్థుల చొప్పున1200 మంది అండర్​​ 14, అండర్​ 17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, తదితర గేమ్స్, అథ్లెటిక్స్​ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. అక్టోబర్ నెల నల్గొండలో జరిగిన జోనల్ స్థాయి క్రీడల్లో గెలుపొందిన వారు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.