డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు షురూ

రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ సందడి మొదలైంది. నగర వీధులు మొదలు సిటీ ఔట్ కట్స్ వరకు తెగ సందడి కనిపిస్తుంది. అయితే ముందుగానే ప్రకటించినట్లు పోలీసులు సాయంత్రం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మొదలుపెట్టారు. జగిత్యాలలోని కోరుట్ల పట్టణంలో పోలీసులు బారికేడ్లు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు...థర్టీ ఫస్ట్ దావత్ లతో.. లిక్కర్ సేల్స్ జోరందుకుంటున్నాయి. బీర్లు, బ్రాండెడ్ వైన్ బాటిళ్ల సేల్స్ బాగా పెరిగాయని  వైన్ షాప్ ఓనర్లు వెల్లడిస్తున్నారు. అర్ధరాత్రి వరకు సేల్స్ కు అవకాశం ఉన్నా.. ముందే పార్టీ కోసం అరేంజ్ చేసుకుంటున్నారు. చుక్క తాగి ముక్క తిని చిందేసేందుకు రెడీ అవుతున్నారు.  

థర్టీ ఫస్ట్ నైట్ ను ఫుల్ ఎంజాయ్ చేసేందుకు జనం హోటళ్ళు, పబ్స్, క్లబ్స్, రిసార్టులకు వెళ్తున్నారు. రిసార్ట్స్, హోటల్స్ కు వెళ్లని వారు ఇంట్లోనే విందు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. థర్టీ ఫస్ట్ దావత్ అంటే చుక్క, ముక్క ఉండాల్సిందే అంటున్నారు. కానీ.. మందు తాగి రోడ్డెక్కితే తాట తీస్తామని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు.