OTT Release movies: ఈ వారం ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాలు..

OTT Release movies: ఈ వారం ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాలు..

రిప్లై ఎందుకు రాలేదు?

టైటిల్: లీలా వినోదం
ప్లాట్​ ఫాం: ఈటీవి విన్​
డైరెక్షన్ : పవన్ సుంకర
కాస్ట్​ :  షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణరాజు, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా

ఈ కథ 2008లో జరిగినట్టుగా చూపిస్తారు. ప్రసాద్ (షణ్ముఖ్ జస్వంత్) డిగ్రీ స్టూండెంట్​.. అప్పుడే  ఎగ్జామ్స్​ పూర్తవుతాయి. అతను తన క్లాస్​మేట్​ లీల(అనఘా అజిత్)ను చాలా రోజుల నుంచి ప్రేమస్తుంటాడు. కానీ.. ఆ విషయం ఆమెకు చెప్పే ధైర్యం లేక ఆగిపోతాడు. కానీ..  చివరి ఎగ్జామ్​ రోజు ఎలాగోలా ఆమె ఫోన్​ నంబర్​ సంపాదిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ సరదాగా చాట్​ చేసుకుంటారు. ఒకరోజు తన ఫ్రెండ్స్​ బలవంతపెట్టడంతో తన ప్రేమని లీలకి చెప్పేస్తాడు. కానీ.. అప్పటినుంచి లీల మెసేజ్​ చేయడం ఆపేస్తుంది. మరోవైపు ప్రసాద్​.. తనంటే ఇష్టం లేదా? లేక ఇంట్లో తెలిసిపోయిందా? అసలు ఆమె ఏమనుకుంటుంది? అని రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. ఇంతకీ ఆమె ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ప్రసాద్​ లవ్ సక్సెస్​ అయ్యిందా? లేదా?  తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

డబ్బు కోసం.. 
టైటిల్ : ముర
ప్లాట్​ ఫాం : ప్రైమ్​ వీడియో
డైరెక్షన్ : ముహమ్మద్ ముస్తఫా
కాస్ట్​: సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి, హృదు హరూన్, యదుకృష్ణన్, అనుజిత్, జోబిన్ దాస్

కేరళ రాజధాని తిరువనంతపురంలో సాగే కథ ఇది. ఆనందు (హృదు హరూన్), మను (యదు కృష్ణన్), మనఫ్ (అనుజిత్), సాజి (జాబిన్ దాస్) నిరుద్యోగులు. నేరాలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం అని(సూరజ్ వెంజరమూడు) అనే గ్యాంగ్‌స్టర్ దగ్గరకు వెళ్తారు. అతను వాళ్లకు మధురైలోని ఒక ఫ్యాక్టరీలో బాగా డబ్బుంది. దానిని దొంగిలించి తీసుకురావాలని చెప్తాడు. అతను చెప్పినట్టే పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించి తీసుకొచ్చి ఇస్తారు. ఆ తర్వాత అందులో నుంచి కొంత వాటా తమకు కూడా ఇవ్వాలని అడుగుతారు. కానీ.. అని ఆ డబ్బు రమ చేచి (మాలా పార్వతి)దని చెప్తాడు. రమ వాళ్లకు తలా పాతిక లక్షలు ఇస్తానంటుంది. అందుకు  వాళ్లు ఒప్పుకోరు. దాంతో.. రమ కొడుకు వాళ్లను కొడతాడు. ఆ తర్వాత నలుగురూ కలిసి పగ తీర్చుకోవడానికి అతనిపై దాడి చేసి, విపరీతంగా కొడతారు.  తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? తెలియాలంటే ఈ సినిమా చూడాలి. 

కిడ్నాప్​!

టైటిల్ : నిరంగల్ మూండ్రు
ప్లాట్​ ఫాం : ఆహా తమిళ్​
డైరెక్షన్ : కార్తీక్ నరేన్
కాస్ట్​​ : అధర్వ, శరత్‌కుమార్, రెహమాన్, అమ్ము అభిరామి, దుష్యంత్ జయప్రకాష్

వసంత్ (రెహమాన్) టీచర్​గా పనిచేస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి అని పేరుంది. కానీ.. తాగినప్పుడు మాత్రం మూర్ఖుడిలా మారతాడు. అతని కూతురు పార్వతి (అమ్ము అభిరామి) హైస్కూల్ స్టూడెంట్​. ఆమెని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేస్తారు. అప్పుడు వసంత్​ స్టూడెంట్​ శ్రీ (దుష్యంత్) చూస్తాడు. ఇద్దరూ కలిసి పోలీసులకు కంప్లైంట్​ చేస్తారు. మరోవైపు వెట్రి (అథర్వ) షార్ట్‌ ఫిల్మ్స్ చేస్తూ.. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంటాడు. వాళ్ల నాన్న సెల్వం (శరత్‌కుమార్) లంచాలు తీసుకునే పోలీస్​ ఆఫీసర్​. అందుకే  అతనికి నాన్న అంటే పెద్దగా ఇష్టముండదు. పార్వతి కిడ్నాప్​తో వీళ్లకు సంబంధం ఏంటి? అసలు ఆమెని ఎవరు కిడ్నాప్​ చేశారు? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.