డిసెంబర్ 8న కామరెడ్డిలో జడ్పీ సమావేశం

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జడ్పీ మీటింగ్​ శుక్రవారం కలెక్టరేట్​లోని  మీటింగ్​ హాల్​లో జరగనుంది. ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న  ఈ మీటింగ్​పై  ఆసక్తి నెలకొంది.  మీటింగ్​కు  కొత్తగా గెలిచిన  ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం లేదు.  వారు ఇంకా  ప్రమాణ స్వీకారం చేయలేదు.  మరో వైపు మెజార్టీ జడ్పీటీసీలు,  ఎంపీపీలు  హాజరవుతారా? లేదా అన్నది సందేహంగా ఉంది.  3 రోజుల క్రితం బీఆర్​ఎస్​ కు చెందిన కొందరు సభ్యులు  అంతర్గత మీటింగ్​ ఏర్పాటు చేసుకున్నారు. జడ్పీ మీటింగ్​కు ముందు  ఈ మీటింగ్​  ఏర్పాటుకు చేసుకొవటం చర్చనీయాంశంగామారింది.   

ALSO READ:-తెలంగాణలో ప్రజా దర్బార్ ఎలా, ఎప్పుడు పుట్టింది.. నాగోబా జాతరతో లింకేంటీ..?