డిసెంబర్ వాటర్ బిల్లొచ్చింది.. ఫ్రీ వాటర్ స్కీమ్ ఉన్నట్టా..లేనట్టా?

డిసెంబర్ వాటర్ బిల్లొచ్చింది.. ఫ్రీ వాటర్ స్కీమ్ ఉన్నట్టా..లేనట్టా?
కేటీఆర్ చెప్పినా ఇప్పటికీ విధివిధానాలు సిద్ధం కాలే డిసెంబర్ నెల బిల్లు కట్టాలో లేదోనని కన్ఫ్యూజన్​లో జనం హైదరాబాద్, వెలుగు: ఫ్రీ వాటర్ సప్లయ్ కి సంబంధించిన విధివిధానాలు ఇంకా పూర్తి కాలేదు. డిసెంబర్ 1 నుంచి ఈ స్కీమ్  అమలు చేస్తామని స్వయంగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికీ నెల గడిచిన కనీసం ఆ దిశగా అధికారులు విధి విధానాలను కూడా సిద్ధం చేయలేదు.  దీంతో అసలు ఫ్రీ వాటర్ స్కీమ్ ఉన్నట్టా, లేనట్టా అని జనం అయోమయానికి గురవుతున్నారు.  ఫ్రీ వాటర్ అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని 15 రోజుల క్రితమే వాటర్ బోర్డు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటికీ ఆర్డర్స్ ఇష్యూ చేయకపోవటంతో అధికారులు కూడా గందరగోళంలో ఉన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 లోపు బిల్లింగ్ చేయాల్సి ఉండగా జనవరిలో బిల్లు వసూలు చేయాలా వద్ద అన్నది అధికారులకు కూడా అర్థం కావటం లేదు. బిల్లు వసూలు ఎట్లా? సిటీలో  9. 8 లక్షల నల్లా కనెక్షన్లు ఉంటే, ఇందులో 9.7లక్షల నల్లాలకు ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తిస్తుంది. అయితే వీటిలో ఎక్కువ శాతం  అపార్ట్ మెంట్లలో ఉన్న కనెక్షన్సే ఉన్నాయి. వీటికి ఒక్కో ఫ్లాట్ కు  20 వేల లీటర్ల నీళ్లను ఫ్రీ గా ఇస్తే దాదాపు అందరికీ ఇది ప్రయోజనంగా ఉంటుంది. కానీ ఒక్క అపార్ట్ మెంట్ లోనే కొన్ని ఫ్లాట్లకు కలిపి ఉచిత వాటర్ స్కీమ్ ను అమలు చేస్తే ప్రయోజనం ఉండదు. పైగా ఈ నెల బిల్లు సంగతి ఏంటన్నది అటు అధికారులకు కూడా అర్థం కావటం లేదు. ప్రభుత్వం గత నెల నుంచే ఫ్రీ వాటర్ హామీ అమలవుతుందని చెప్పింది. దీంతో చాలా మంది జనం ఈ నెల బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు రానందున బిల్లు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అసలు వాటర్ బిల్లు ఫ్రీ ఉంటుందా ఉంటే ఎప్పటి నుంచి అన్నది స్పష్టం చేయాలని జనం అడుగుతున్నారు. బల్దియా ఎన్నికల సందర్భంగా హామీ బల్దియా ఎన్నికల సందర్భంగా నగర జనాలకు ఉచిత వాటర్ సప్లయ్ చేస్తామంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలు జరిగినా మూడు రోజుల్లోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ దీనిపై అటు అధికారులకు ఇటు జనాలకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు. నెలకు 20 వేల లీటర్ల వరకు ఫ్రీగా ఇస్తామని దాదాపు 98 శాతం వరకు నల్లా కనెక్షన్లకు ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. అయితే అపార్ట్ మెంట్ లలో వారికి సంబంధించి ఫ్రీ వాటర్ స్కీమ్ ఎలా అమలు చేయాలన్న దానిపై స్పష్టత రాలేదు. అపార్ట్ మెంట్ మొత్తాన్ని యూనిట్ గా భావిస్తే మెజార్టీ ప్రజలకు ప్రయోజనం ఏమీ ఉండదని వాటర్ బోర్డు అధికారులే చెప్తున్నారు. దీంతో అపార్ట్ మెంట్ లో ఉండే ఒక్కో ఫ్లాట్ కు నెలకు 20 వేల లీటర్ల నీటిని ఫ్రీ గా ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. For More News.. బాలికను వేధించిన కేసులో యువకుడికి జీవిత ఖైదు సిటీలో రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్.. ఆన్​లైన్ అడ్డాగా అకౌంట్స్ ఖాళీ థియేటర్లు ఫుల్ చేసుకోవడానికి సర్కార్ పర్మిషన్