
పంజాగుట్ట, వెలుగు : వినికిడి సమస్యపై అవగాహన కల్పించేందుకు మార్చి 2న గచ్చిబౌలిలో ‘డెసిబెల్ డాష్–2025 రన్ఫర్హియరింగ్’ నిర్వహిస్తున్నట్లు డాక్టర్శ్రీప్రకాశ్ తెలిపారు. గురువారం ఆయన పంజాగుట్టలో మీడియాతో మాట్లాడారు. డెసిబెల్డాష్లో భాగంగా 2 కె, 5 కె,10 కె వర్చుల్రన్ లు, ఫ్రీ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు.
మార్చి 3 నుంచి 10 వరకు నిర్వహించే ఫ్రీ హెల్త్ చెకప్ కోసం 91222 33354 కు కాల్చేసి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో డాక్టర్ అశ్విని అమరేశ్వర్తదితరులు పాల్గొన్నారు. రన్ ఫర్ హియరింగ్ పోస్టర్ ను ఆవిష్కరించారు.