న్యూఢిల్లీ: విప్రోకు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.2,667.3 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ లాభం రూ.2,649.10 కోట్లుగా ఉంది. రెవెన్యూ (కన్సాలిడేటెడ్) మాత్రం రూ.22,539.70 కోట్ల నుంచి రూ.22,515.90 కోట్లకు తగ్గింది. మరోవైపు కంపెనీ తమ ఐదు హోలీఓన్డ్ సబ్సిడరీలను పేరెంట్ కంపెనీలో విలీనం చేయాలని నిర్ణయించుకుంది.
విప్రో హెచ్‌ఆర్ సర్వీసెస్, విప్రో ఓవర్‌సీస్ ఐటీ సర్వీసెస్, విప్రో టెక్నాలజీ ప్రొడక్ట్ సర్వీసెస్, విప్రో ట్రేడ్‌మార్క్స్ హోల్డింగ్, విప్రో విఎల్‌ఎస్‌ఐ డిజైన్ సర్వీసెస్ కంపెనీలు పేరెంట్ కంపెనీ విప్రో లిమిటెడ్‌లో విలీనమవుతాయి.