సింగరేణిలో క్రీడలకు తగ్గుతున్న ప్రోత్సాహం

సింగరేణిలో క్రీడలకు తగ్గుతున్న ప్రోత్సాహం
  • ఏటా తగ్గిపోతున్న క్రీడా బడ్జెట్​.. క్రీడాకారుల నిరుత్సాహం.. 
  • రెండు నెలల కిందటే రిలీజైన కోల్​ ఇండియా గేమ్స్​, స్పోర్ట్స్​ క్యాలెండర్​ 
  • సింగరేణిలో ఫిబ్రవరిలో అథ్లెటిక్స్​ 
  • ఇంకా జాడలేని స్పోర్ట్స్​ క్యాలెండర్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : క్రీ-డలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సింగరేణి ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రోత్సాహం కనిపించడం లేదు. ఏటా కేటాయించే బడ్జెట్​లోనూ కోత విధిస్తున్నారు.  గతంలో ఘనమైన ఫలితాలు. పతకాలు సాధించిన సింగరేణి క్రీడాకారులు ప్రస్తుత ం  నిరుత్సాహానికి గురవుతున్నారు. 

విడుదల ఆలస్యం

 ఈ ఏడాది బడ్జెట్​ రిలీజ్​పై ఇంకా క్లారిటీ లేదు. ఆర్థిక సంవత్సరం మొదలై ఐదు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు క్రీడా బడ్జెట్​ ఫైనల్​ కాకపోవడంతో క్రీడాకారుల్లో నిరుత్సాహం నెలకొంది. మరో వైపు కోల్​ ఇండియా స్థాయిలో నిర్వహించే గేమ్స్​, స్పోర్ట్స్​ క్యాలెండర్​ షెడ్యూల్​ రిలీజై రెండు నెలలు అవుతోంది. సింగరేణిలో మాత్రం ఇప్పటి వరకు గేమ్స్​, స్పోర్ట్స్​   షెడ్యూల్​ రిలీజ్​ చేయకపోవడం సింగరేణి నిర్లక్ష్యమే అని క్రీడాకారులు వాపోతున్నారు. 

జాడలేని గేమ్స్​, స్పోర్ట్స్​ క్యాలెండర్​ 

 కోల్​ ఇండియా స్థాయిలో నిర్వహించే గేమ్స్​, స్పోర్ట్స్​ పోటీల షెడ్యూల్​ను రెండు నెలల కిందటే రిలీజ్​ అయింది.  కోల్​ ఇండియా స్థాయిలో 10కిపైగా బొగ్గు పరిశ్రమల్లో ఒక్కో కంపెనీ ఒక్కో గేమ్​ నిర్వహించేలా కోల్​ ఇండియా షెడ్యూల్​లో పేర్కొంది. 

దీంట్లో భాగంగా అథ్లెటిక్స్​ పోటీలకు రానున్న ఫిబ్రవరిలో సింగరేణి సంస్థ అతిథ్యం ఇవ్వనుంది. వాలీబాల్, టేబుల్​ టెన్నిస్​, వెయిట్​ లిఫ్టింగ్, లాన్​ టెన్నీస్, ఫుట్​బాల్, కల్చరల్​ మీట్, కబడ్డీ, హాకీ, చెస్​, క్రికెట్​, క్యారెమ్స్​ పోటీలను దేశంలోని ఈసీఎల్, సీఐఎల్, సీసీఎల్, ఎంసీఎల్, ఎన్​సీఎల్, ఎస్​ఈసీఎల్ తదితర పరిశ్రమలు పాల్గొననున్నాయి.

కానీ,  ఇప్పటి వరకు సింగరేణి దానికి సంబంధించిన షెడ్యూల్​ ను విడుదల చేయలేదు. దీంతోపాటు కోల్​ ఇండియా  పోటీలకు సింగరేణి నుంచి పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకు కంపెనీ వ్యాప్తంగా ఏరియాలు, రీజియన్​లు, కంపెనీ స్థాయిలో పోటీలు నిర్వహించాల్సి ఉంది. ఆయా పోటీల్లో ప్రతిభ చూపిన వారిన ఎంపిక చేస్తారు. కానీ ఇప్పటి వరకు గేమ్స్​, స్పోర్ట్స్​ క్యాలెండర్​ షెడ్యూల్​ను సింగరేణి యాజమాన్యం రిలీజ్​ చేయకపోవడం పట్ల క్రీడాకారులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  క్రీడా బడ్జెట్​లో కోత..

సింగరేణి క్రీడల కోసం ఏటా కేటాయించే బడ్జెట్​ను క్రమంగా తగ్గిస్తోంది. కిందటి ఏడాది దాదాపు రూ. 1.43కోట్ల మేర బడ్జెట్​ను గేమ్స్​, స్పోర్ట్స్​ కో ఆర్డినేటర్లు ప్రతిపా దించగా రూ. 1.25కోట్లను మాత్రమే సంస్థ కేటాయించింది. అంతకు ముందు ఏడాది ఇదే పరిస్థితి. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1.46కోట్లు అవసరం ఉందని ప్రతిపాదించగా రూ. 1.20కోట్లకు మాత్రమే యాజమాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.  ఇలా బడ్జెట్​ తగ్గుతుండటం పట్ల క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కోల్​ ఇండియాలో రాణింపు అంతంతే 

కోల్​ ఇండియా స్థాయిలో హాకీ  సింగరేణి గత  మూడేండ్లుగా విజయం సాధిస్తోంది. కొన్ని పోటీలల్లో పతకాలకు సింగరేణి కార్మికులు పరిమితం అవుతున్నారు. సింగరేణిలో క్రీడాకారుల ఎంపిక విషయంలో వివక్ష జరుగుతుందనే విమర్శలున్నాయి. గతంలో స్పోర్ట్స్​, గేమ్స్​లో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున కోల్​ ఇండియా స్థాయిలో పతకాలు తెచ్చే వారని సీనియర్లు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న క్రీడాకారులకు ప్రాక్టీస్ లేదని, కేవలం గేమ్స్ జరిగే టైంలోనే హడావుడి జరుగుతోందని అంటున్నారు.

పెండింగ్​లోనే లాస్ట్​ ఇయర్​ స్పోర్ట్స్​ డ్రెస్​, షూస్​ 

ఏటా క్రీడాకారులకు స్పోర్ట్స్​ డ్రెస్​, షూస్​ ఇతర సామగ్రిని అందజేస్తుంది. కానీ లాస్ట్​ ఇయర్​కు సంబంధించి స్పోర్ట్స్​ డ్రెస్​   ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. పర్చేజ్​ డిపార్ట్​మెంట్​ అధికారులు ఈ విషయంలో   నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు క్రీడాకారులకు కాకుండా తమకు అనుకూలంగా ఉన్న అధికారులతో పాటు యూనియన్ లీడర్లకు డ్రెస్​, షూస్​ ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.