వాటర్ ట్యాంక్ లో శవం.. 10 రోజులుగా ఆ నీటినే తాగిన జనం

నల్లగొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో శవం  కనిపించింది. గడిచిన పది రోజులుగా  మున్సిపాలిటీలోని ప్రజలు అందులోని నీళ్లనే తాగుతున్నారు. తాగునీరు తేడాగా ఉండడంతో  ప్రజలు వాటర్ సప్లై సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ట్యాంక్ లో వాటర్ ని చెక్ చేయడానికి వెళ్లిన మున్సిపాలిటీ సిబ్బంది,  స్థానికులకు అందులో శవం కనిపించింది.  దీంతో మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. 

 నీళ్లను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మున్సిపాలిటీ సిబ్బంది అంటూ మండిపడుతున్నారు.  గతంలోనూ నాగార్జునసాగర్ మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లో  దాదాపు 30 కోతులు మరణించిన ఆ ఘటన మరువకముందే నల్లగొండ మున్సిపాలిటీ లో శవం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.  నీళ్ల ట్యాక్ లో ఉన్న మృతదేహం హనుమాన్ నగర్ కి చెందిన ఆవుల వంశీగా గుర్తించారు స్థానికులు. గత నెల 24 వ తేదీ నుంచి వంశీ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.