అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..

హైదరాబాద్ లోని మియాపూర్ లో ఇటీవల అదృశ్యమైన అమ్మాయి ఐశ్వర్య మృతదేహం లభించింది. తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో అమ్మాయి మృతదేహం లభించినట్లు తెలిపారు పోలీసులు. నవంబర్ 8న ఐశ్వర్య అదృశ్యమైందంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తుక్కుగూడలో అమ్మాయి మృతదేహం లభించినట్లు తెలిపారు.  

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్ కు చెందిన 17ఏళ్ళ ఐశ్వర్య కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐశ్వర్యకు  ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉందని గుర్తించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

ALSO READ | పెస్ట్ కంట్రోల్ చేపిస్తున్నారా..! జాగ్రత్త.. ఇద్దరు పిల్లల ప్రాణం తీసిన విషపూరిత రసాయనాలు

ఈ క్రమంలో తుక్కుగూడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు మియాపూర్ పోలీసులు.