
- శ్రీ వివేకానంద హెచ్ఎస్ లోగో ఉన్న షర్ట్ జేబు స్వాధీనం
- చనిపోయి నెల దాటి ఉంటుందన్న పోలీసులు
ముషీరాబాద్, వెలుగు: దోమలగూడ పీఎస్ పరిధిలోని లోయర్‌ట్యాంక్‌బండ్‌లో ఉన్న డీబీఆర్మిల్స్ప్రాంగణంలో ఓ మహిళ అస్తి పంజరం లభ్యమైంది. చనిపోయి సుమారు 30రోజులు దాటి ఉంటుందని, ఆమె ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే కొన్ని ఆధారాలు దొరికాయని ఇన్స్పెక్టర్శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నిరంజన్ తెలిపారు. కవాడిగూడలో ఉన్న డీబీఆర్మిల్లు మూతబడి ఏండ్లవుతోంది.
కేసు కోర్టులో ఉండడంతో ఇప్పటికీ 25 ఏండ్లుగా నిరుపయోగంగానే ఉంది. దీంతో ఇక్కడ ఒక వాచ్మెన్మాత్రమే కాపాలాగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం మిల్స్ప్రాంగణంలో ఉన్న సంపు నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో వాచ్మెన్పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మిల్లుకు చేరుకొని సంపు పైకప్పు తొలగించి చూడగా, ఓ అస్తి పంజరం కనిపించింది. దీంతో పై నుంచి తీసే అవకాశం ఉండడంతో సంపును ఒకవైపు పగలగొట్టారు. పరిశీలించి చూడగా పూర్తిగా కుళ్లిపోయి.. ఇప్పుడిప్పుడే అస్తి పంజరం దశకు చేరుకుంటున్నట్టు స్థితిలో ఉందని గుర్తించారు.
అది ఒక యువతి అస్తి పంజరం అని, చనిపోయి సుమారు 30 రోజులు అయి ఉంటుందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. వయస్సు సుమారు 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం చేసే పరిస్థితి లేకపోవడంతో గాంధీ దవాఖాన సిబ్బందిని అక్కడికే పిలిపించారు. తర్వాత గాంధీ మార్చురీకి తరలించి భద్రపరిచారు. అస్తి పంజరంపై ఉన్న డ్రెస్‌ను కడిగి చూడగా ఓ జేబు బయటపడింది. దానిపై శ్రీ వివేకానంద హెచ్.ఎస్అని ఉంది. వివేకానంద పేరుపై చాలా ఇన్స్టిట్యూషన్స్ఉండడంతో ఎక్కడిదో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.