పాల్వంచ, వెలుగు : దుర్గాదేవి శర న్నవరాత్రుల సందర్భంగా పాల్వంచ పట్టణంలోని ఆదర్శనగర్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ మండపంలో నిర్వాహకులు మంగళవారం రూ.5 లక్షల నగదుతో అలంకరించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కడలి శ్రీనివాసరావు, హిమ వరుణ్, తాటికొండ రామ కృష్ణ, పీ.నరేశ్, కే.దుర్గాప్రసాద్, కల్లూరు ప్రదీప్, ఎం.జగదీశ్, పీ.సురేశ్, చండ్ర వెంకటేశ్వర రావు, ఏ.వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.