తగ్గిన ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలు

తగ్గిన ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలు

న్యూఢిల్లీ: విమానాల్లో వాడే ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయల్​(ఏటీఎఫ్​) ధర 1.5 శాతం, హోటళ్లలో, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్​ఎల్పీజీ  సిలిండర్ (19 కేజీలు)​ ధర రూ.14.50 తగ్గింది. ఢిల్లీలో కిలోలీటర్​ ఏటీఎఫ్​ ధర రూ.1,401 తగ్గి రూ.90,455కి పడిపోయింది. ముంబైలో ధర రూ.84,511కు దిగివచ్చింది. అయితే గత ఏడాది నవంబరు, డిసెంబరులో దీని ధరలు పెరిగాయి. వరుసగా ఐదు నెలలు కమర్షియల్​ఎల్పీజీ ధరలను పెంచిన కేంద్రం ఈసారి మాత్రం ధర తగ్గించడంతో ప్రస్తుతం దీని ధర ముంబైలో రూ.1,756 కాగా, కోల్​కతాలో రూ.1,911, కోల్​కతాలో రూ.1,966 ఉంది. ఏటీఎఫ్​, ఎల్పీజీ ధరలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటాయి. ఇంటి అవసరాలకు వాడే సాధారణ 14.2 కేజీల సిలిండర్​ ధర మాత్రం మారలేదు.