- అర్బన్, బాల్కొండలో నిరాశాజనకం
- మిగితా ఏడు సెగ్మెంట్లలో మరింత తగ్గుదల
- రిజల్టివ్వని ఆఫీసర్ల అవగాహన ప్రోగ్రామ్స్
నిజామాబాద్, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను ప్రస్తుత ఎలక్షన్‌తో పోలిస్తే తగ్గుదల కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. పల్లెల కంటే పట్టణాల్లో ఓటింగ్‌శాతం బాగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని విద్యావంతులే పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు.
అర్బన్, బాల్కొండ మారలే..
ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌అర్బన్ సెగ్మెంట్లో ఓటర్ల సంఖ్య అధికం. మొత్తం 2,94,832 మంది ఓటర్లు ఉండగా 1,81,808 మంది ఓటేశారు. 61.66 శాతంగా పోలింగ్‌నమోదైంది. 2018లో కూడా 62.65 శాతంగా పోలింగ్ జరిగింది. ఈసారి ఓటింగ్‌శాతాన్ని పెంచడానికి ఆఫీసర్లు ప్రయత్నించినా, పెద్దగా ఫలితం రాలేదు. గతంలో కంటే ఒకశాతం ఓటింగ్తగ్గింది. బాల్కొండలో మొత్తం 2,21,445 మంది ఓటర్లకు 1,76,586 మంది మాత్రమే ఓటు వేశారు. పోలింగ్79.74 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో ఇది79.70 శాతంగా ఉండగా, ఈసారి పెద్ద మార్పులేదు.
మిగతా చోట్ల..
ఆర్మూర్నియోజకవర్గంలో మొత్తం 2,10,217 ఓట్లలో 1,59,804 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్76.02 శాతం నమోదైంది. 2018లో 79.08 శాతం ఉన్న పోలింగ్ఇప్పుడు తగ్గింది. బోధన్ సెగ్మెంట్లోని మొత్తం 2,20,068 ఓటర్లలో 1,71,247 మంది మాత్రమే ఓటేశారు. 2018లో 81.34 శాతంగా ఉన్న పోలింగ్ఈ ఎన్నికల్లో 77.92 శాతానికి పడిపోయింది. రూరల్ సెగ్మెంట్లో కూడా గత ఎన్నికల్లోని 84.10 శాతంతో పోలిస్తే 8 శాతం తగ్గి ఈ సారి 76.42 శాతంగా నమోదైంది.2,53,233 మంది ఓటర్లలో 1,93,556 మాత్రమే ఓటేశారు. కామారెడ్డిలో 2018లో 78.83 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 75.58 శాతానికి పడిపోయింది.
మొత్తం 2,52,460 ఓట్లలో 1,90,811 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో ఇక్కడ 78.83 శాతం పోలింగ్‌నమోదైంది. ఎల్లారెడ్డిలో మొత్తం2,20,531 ఓట్లలో 1,83,414 మాత్రమే ఈవీఎంలో పడ్డాయి. 83.17 శాతం పోలింగ్ నమోదుకాగా 2018 ఎన్నికల్లో ఈ శాతం 86.32గా ఉంది. జుక్కల్ సెగ్మెంట్లో గత ఎన్నికల 85.56 శాతంగా ఉండగా ఈసారి 81.80 శాతం మాత్రమే వచ్చింది. మొత్తం 1,99,962 మంది ఓటర్లకు 1,63,569 మంది ఓటేశారు.