- శ్రీరాంసాగర్‌కు‘సిల్ట్’ కష్టాలు
- తగ్గుతున్న ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం
సిల్ట్ ను అరికట్టలేకపోవడంవల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్యం సగానికి సగం తగ్గిపోతోంది. ప్రాజెక్టును 100 టీఎంసీల కెపాసిటీతో నిర్మించగా.. ఇప్పుడు 90 టీఎంసీలకు తగ్గిపోయిందని ఆఫీసర్లు చెప్తుండగా .. ఏటా వరదల వల్ల ఎగువ నుంచి పెద్ద ఎత్తున ఇసుక చేరిందని, ప్రాజెక్ట్ వాస్తవ కెపాసిటీ 78 టీఎంసీలు మాత్రమే ఉందని నిపుణులు అంటున్నారు. ఇలాగే ఇసుక వచ్చి చేరుతుంటే మరో 20 ఏళ్లలో వాటర్ స్టోరేజీ కెపాసిటీ 50 టీఎంసీలకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు.
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌లో సిల్ట్భారీగా పేరుకుపోతోంది. ఏండ్లు గడిచేకొద్ది ప్రాజెక్టు నిల్వ కెపాసిటీ తగ్గిపోతోంది. ఎస్సారెస్పీ క్యాచ్మెంట్ఏరియాల్లో ఉన్న సిల్ట్అరెస్ట్ట్యాంక్ల నిర్వహణ కొరవడడంతో ఈ పరిస్థితి నెలకొంది. వరద జలాలతో సిల్ట్ఇలాగే పేరుకుపోతే 100 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ లో మరో 20 ఏండ్ల తర్వాత 50 టీఎంసీలే నిల్వ చేయగలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎస్సారెస్పీని 1968లో నిర్మించారు. మొదట్లో ప్రాజెక్ట్ నీటిసామర్థ్యం100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 78 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్ట్ లో సిల్ట్ కారణంగా 22 టీఎంసీల నీటి సామర్థ్యం తగ్గింది. సిల్ట్సమస్య ప్రాజెక్ట్ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో 30 కి.మీ.పైన గోదావరి నీటి ప్రవాహంలో ఇసుక, మట్టిని నివారించేందుకు సిల్ట్అరెస్ట్ట్యాంక్ లను నిర్మించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశారు. కానీ వీటి నిర్వహణ అంతంతమాత్రంగా ఉండడంతో ప్రాజెక్ట్‌లో వరదప్రవాహం వచ్చినప్పుడల్లా విపరీతంగా సిల్ట్చేరుతోంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రాజెక్ట్రిజర్వాయర్ లెవల్స్ప్రొటెక్షన్కమిటీ నీటి సామర్థ్యంపై అంచనా వేసి నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పిస్తుంది. 2012 సంవత్సరంలో ఈ కమిటీ ఎస్సారెస్పీని సందర్శించింది. ఎస్సారెస్పీ గోదావరి పరివాహక ప్రాంతంలో సిల్ట్ పరిస్థితులపై అధ్యయనం చేసింది. సిల్ట్ అరెస్ట్ ట్యాంక్ ల పనితీరును పరిశీలించింది. ఎస్సారెస్పీ నీటి సామర్థ్యంపై ప్రమాద ఘంటికలు ఉన్నట్లు కేంద్ర జల సంఘానికి నివేదించింది. కమిటీ సూచన మేరకు చర్యలు చేపట్టడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ఏడాది కమిటీ సందర్శించనుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 90 టీఎంసీలు ఉన్నట్లు చూపిస్తున్నా ఇందులో 12 టీఎంసీల మేర సిల్ట్ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
నాలుగేండ్లుగా పెరిగిన వరద..
మహారాష్ట్రలో విష్ణుపురి, గైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్ట్‌ల నిర్మాణం తర్వాత ఎస్సారెస్పీకి నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది. 1994 నుంచి 2005 సంవత్సరాల మధ్య రెండు మధ్యతరహా ప్రాజెక్ట్‌లు విష్ణుపురి, గైక్వాడ్, 2004లో బాబ్లీ ప్రాజెక్ట్నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తిగా నిండిన తర్వాతే గేట్లు తెరిచి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. లేదంటే బాబ్లీ దిగువ ప్రాంతంలో పడే వర్షాలతో మంజీరా, హరిద్ర నదుల వరద మాత్రమే ఎస్సారెస్పీలోకి చేరుతుంది. ఎస్సారెస్పీ 90 టీఎంసీలకు చేరగానే వరద జలాలను 42 గేట్ల ద్వారా కిందికి విడుదల చేస్తారు. 1983, 1987,1991 సంవత్సరాల్లో భారీ వరదలతో ఎస్సారెస్పీ పూర్తిగా నిండింది. మహారాష్ట్రలో పెద్ద వర్షాలు కురిస్తేనే భారీగా వరద నీరు చేరుతుంది. మహారాష్ట్ర గోదావరి నదిపై ఆనకట్టలు కట్టడంతో 1994 నుంచి ఎస్సారెస్పీకి వరద తగ్గుతూ వచ్చింది. 2005 సంవత్సరం తర్వాత 2013లో మాత్రమే భారీ వరద ప్రవాహం వచ్చింది. అయితే గత నాలుగేండ్లుగా ఎస్సారెస్పీ ప్రతి ఏటా నిండుతోంది. గత ఏడాది రికార్డు స్థాయిలో 610 టీఎంసీల వరద ప్రవాహం వచ్చింది. కానీ సిల్ట్సమస్యతో నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
పూడిక సమస్యపై
దృష్టి సారించాం
ఎస్సారెస్పీ క్యాచ్ మెంట్ ఏరియాలోని సిల్ట్అరెస్ట్ట్యాంక్ల పని తీరు మెరుగుపరుస్తాం. నిపుణులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటాం. భారీ వరదలతో మట్టి కోతకు గురై సిల్ట్కొద్దిగా చేరుతోంది. ప్రతి ఏడాది సిల్ట్ అరెస్ట్ట్యాంక్లు నిర్మించిన చెరువులు, వాగుల పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తాం. ప్రాజెక్ట్ నీటిసామర్థ్యం తగ్గకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాస్, ఎస్ఈ, ఎస్సారెస్పీ