ఈ విజయాన్ని నా తండ్రికి అంకితమిస్తున్నా : స్టాలిన్

ఈ విజయాన్ని నా తండ్రికి అంకితమిస్తున్నా : స్టాలిన్

తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ మరో సారి తండ్రి చేసిన వ్యాఖ్యలను రిపీట్ చేసి మరో మారు దేశం దృష్టిని ఆకర్షించా రు. ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించినప్పటికీ.. అనూహ్య పరిస్థితులు ఎదురైతే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలున్నాయి. ఒకవేళ ఇండియా కూటమికి అవకాశం లభిస్తే.. ప్రధాని అభ్యర్థి రేసులో మీరు ఉంటారా? అని మీడియా ప్ర శ్నంచగా.. తన తండ్రి కరుణానిధి ఫేమస్ డైలాగ్ను రిపీట్ చేశారు.

 'నా ఎత్తు ఎంతో నాకు తెలుసు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పా' అని అన్నారు. గత ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో తమ కూటమికి 39 స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 40కి 40 సాధించామని చెప్పారు. ఈ విజ యాన్ని నా తండ్రికి అంకితమిస్తున్నానని అన్నారు. చాలా రాష్ట్రాల్లో మోదీ వ్యతిరేక గాలి వీచిందని చెప్పారు.