ఉమ్మడి జిల్లాలో దీక్షా దివస్

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : దీక్షా దివస్​ సందర్భంగా బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెంలో మోటార్​ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్​ పోరాటం సాగించారన్నారు. కేసీఆర్​ పోరాట స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నాటి ఫొటో ఎగ్జిబిషన్​ను నేతలు తిలకించారు.

ఖమ్మంలో పార్టీ  జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కార్యక్రమ ఇన్​చార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు చంద్రావతి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్,  కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, భానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు