నేడు అలుగునూరులో దీక్షా దివస్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లోని అలుగునూరులో శుక్రవారం నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. 20వేల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు మాజీ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, మాజీ ఎంపీ లక్ష్మీకాంత రావు, మాజీ ఎమ్మెల్యేలు సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ ప్రోగ్రామ్​కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటెండ్ అవుతున్నారు.

తెలంగాణ కల సాకారం చేసుకునేందుకు కేసీఆర్ ఎంతో పోరాటం చేశారని గంగుల కమలాకర్ అన్నారు. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. 2009, నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు బయల్దేరిన కేసీఆర్​ను.. పోలీసులు అలుగునూరులో అరెస్ట్ చేశారు. కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును ప్రతి ఏటా దీక్షా దివస్​గా ఆ పార్టీ నిర్వహిస్తున్నది.