పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ఇస్తే తాను ప్రగతిభవన్ ముందు నిరాహారదీక్ష చేస్తానని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య హెచ్చరించారు. పెద్దపల్లిలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దాసరిపై రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిని.. ఎమ్మెల్యే బినామి కాంట్రాక్టర్లే చేస్తున్నారన్నారు.
ఇసుక, మట్టి అక్రమ రవాణాలో ఎమ్మెల్యేదే ప్రధాన పాత్ర అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు పార్టీలో కీలక పాత్ర పోషించిన నాయకులను ఎమ్మెల్యే పక్కన పెట్టాడన్నారు. దాసరికి టికెట్ఇస్తే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి సీటును వదులుకోవాల్సిందేనన్నారు. మాజీ ఎంపీ వినోద్కుమార్చొరవ తీసుకొని దాసరి అవినీతిని కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలని కోరారు. త్వరలో కేటీఆర్‌ను కలిసి ఎమ్మెల్యే అవినీతి గురించి వివరిస్తామన్నారు.