-
ఇలాంటి సందర్భాల్లో తక్షణ చర్యలు అవసరం
-
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
వాషింగ్టన్: ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ అసభ్యకర డీప్‌ఫేక్ ఫొటోలు ప్రస్తుతం అగ్రరాజ్యంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ట్రెండ్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఈ ట్రెండ్ దారుణం, భయానకమైనది. ఇలాంటి సందర్భాల్లో వేగంగా స్పందించడం అవసరం. ఆమోదయోగ్యమైన కంటెంట్మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా రక్షణ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. డీప్‌ఫేక్‌ల కట్టడికి దర్యాప్తు సంస్థలు, టెక్ సంస్థలు కలిసివస్తే.. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వాటిని అరికట్టవచ్చు’ అని నాదెళ్ల తెలిపారు.