రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ యాక్టర్ దీప్ సిద్ధును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఎర్రకోటపై జరిగిన దాడికి సిధ్దునే కారణమనే ఆరోపణలున్నాయి. ఆందోళనల్లో ఆయన పాల్గొన్నట్టు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ర్యాలీ ఎర్రకోటవైపు వెళ్లడానికి ఆయన రెచ్చగొట్టారని.. ఎర్రకోటపై సిక్కు జెండా పెట్టడంలోనూ ఆయన పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. కిసాన్ రిపబ్లిక్ పరేడ్ ఇష్యూ సీరియస్ కావడంతో జనవరి 26 నుంచి దీప్ సిద్ధు పరారీలో ఉన్నారు. దీంతో ఆయనను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు పోలీసులు ఏర్పాటు చేశారు. దీప్ సిద్ధు ఆచూకీ కోసం వెతికిన పోలీసులు.. ఆయనపై లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. దీప్ సిద్ధు గురించి సమాచారం ఇస్తే లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు. ఎట్టేకేలకు ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీప్ సిద్దును ఛండీఘర్ మరియు అంబాలా మధ్య ఉన్న జీరక్‌పూర్ వద్ద అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
For More News..