
- నాంపల్లి కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డ్
హైదరాబాద్,వెలుగు: బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ రూ.10 కోట్ల పరువునష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో శుక్రవారం ఆమె ఈ కేసు వేశారు. న్యాయమూర్తి 40 నిమిషాల పాటు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రభాకర్.. దీపాదాస్ మున్షీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
పార్టీ కార్యకర్తల నుంచి గిఫ్ట్ రూపంలో ఆమె బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కడ తీసుకున్నారో కూడా తెలుసని వ్యాఖ్యానించారు. చనిపోయిన ఆమె భర్త పేరు కూడా ఆయన ప్రస్తావించారు. కాగా.. దీపాదాస్, ఆమె భర్త గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ప్రభాకర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుకు భంగం కలిగిందని దీపాదాస్ పేర్కొన్నారు.