
మంచిర్యాల జిల్లాలో ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి దీపాదాస్ మున్షీ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని హైటెక్ సిటీలోనీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చేశారు. జిల్లాకు చెందిన నేతలతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, డీసీసీ ప్రెసిడెంట్ సురేఖ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులకు శాలువాతో సత్కరించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు దీపాదాస్ మున్షీ.